ఆ నిధులు ఇక ఇవ్వలేం.. ఏపీకి తేల్చి చెప్పిన కేంద్రం
4వ ఆర్థిక సంఘం కాలవ్యవధి ముగియడంతోనే పంచాయతీలకు నిధులు విడుదల చేయలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది
ఆంధ్రప్రదేశ్ లోని పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన నిధులను విడుదల చేయడం లేదు. 14వ ఆర్థిక సంఘం కాలవ్యవధి ముగియడంతోనే నిధులు విడుదల చేయలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీ పంచాయతీలకు రావాల్సిన 529 కోట్ల నిధులను విడుదల చేయలేమని ఆయన పేర్కొన్నారు.
మురిగిపోయాయి....
14 ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన నిధుల్లో 529 కోట్ల నిధులను విడుదల చేయలేకపోయామని, ఈలోపు ఆర్థిక సంఘం కాలవ్యవధి ముగియడంతో అవి మురిగిపోయినట్లేనని మంత్రి పేర్కొన్నారు. ఇక 2022 - 2026 ఆర్థిక సంవత్సరాల్లో 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన నిధులను మాత్రం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. దాదాపు 529 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏపీ నష్టపోయింది.