ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Nowఅమరావతి రైతులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని పనులను వేగంగా చేయడంలో భాగంగా రైతులకు కేటాయించిన రిటర్న్ బుల్ ప్లాట్లలో సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. తొలి విడత పనుల్లో భాగంగానే ఈ ప్లాట్లకు అన్ని రకాల వసతులను సమకూర్చాలని నిర్ణయించింది. రైతులు వేగంగా ఇళ్లు నిర్మించుకోవాలన్నా, లేకుంటే ఇతర కమర్షియల్ కాంప్లెక్స్ లను నిర్మించుకోవడానికి అనువుగా అన్ని సదుపాయాలను కల్పించేందుకు సిద్ధమయింది. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు రహదారులు, మంచినీరు, మురుగునీటి కాల్వ వ్యవస్థ, విద్యుత్తు, గ్రీనరీ, కాల్వలతో పాటు రిజర్వాయర్లు కూడా నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు.
నాడు అలా...
2014లో చంద్రబాబు ఇంత స్పీడ్ గా అమరావతిపై నిర్ణయం తీసుకోలేదు. నిదానంగా పనులను ప్రారంభించారు. తొలి విడతగా నాలుగు వేల కోట్ల రూపాయలను మాత్రమే రాజధాని పనుల కోసం కేటాయించారు. అదీ అరకొరగానే పనులు సాగాయి. పెద్దగా ఆయన ఫోకస్ కూడా పెట్టలేదు. నాడు పోలవరంపై ఎక్కువ దృష్టి పెట్టిన చంద్రబాబు అమరావతిలో తాత్కాలిక భవనాలను మాత్రం నిర్మించి వదిలేశారు. అయితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తేవడంతో రాజధాని భూములకు విలువ పడిపోయింది. కొనేవారు కూడా లేరు. పూర్తిగా తమ ప్రభుత్వానికి నాడు సహకరించిన రైతులు నష్టపోయారు. దీంతో ఈసారి చంద్రబాబు ఆతప్పిదం చేయదలచుకోలేదు. ముఖ్యమంత్రి అయిన వెంటనే రాజధాని పనులను వేగిరం చేపట్టాలని నిర్ణయించారు. అందుకే కేంద్రంతో సంప్రదింపులు జరిపి అప్పులు పుష్కలంగా తెచ్చుకునే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు.
47 వేల కోట్ల రూపాయల పనులకు...
తొలి విడత పనులకు పదిహేను వేల కోట్ల రూపాయలను కేటాయించడంతోనే చంద్రబాబు ఎంత దృష్టి పెడుతుంది అర్ధమవతుంది. ఈ నిధులతో ఐకానిక్ టవర్లు, ప్రభుత్వ కాంప్లెక్స్ తో పాటు హైకోర్టు, అసెంబ్లీ భవనాలను పూర్తి చేయనున్నారు. అలాగే నిలిచిపోయిన ఉన్నతాధికారులు, ఉద్యోగాల నివాస భవన సముదాయం పనులను కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు 47 వేల కోట్ల రూపాయలతో పనులు ప్రారంభం కానున్నాయి. ప్రతి పనికీ ఒక టైమ్ ను పెట్టారు. ఆ టైమ్ కు ఆ పని పూర్తి కావాలని చంద్రబాబు ఆదేశించారు. అదే సమయంలో ప్రతి వారం సీఆర్డీఏ అధికారులతో సమావేశమై పనుల పురోగతిపై సమీక్షిస్తుండటంతో అమరావతి పనులు పరుగులు పెట్టించాలని చూస్తున్నారు. కేవలం మూడేళ్లలో అమరావతిలో ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకునేలా వాతావరణం సృష్టించాలన్న తాపత్రయంతో ఉన్నారు.
రైతుల్లో ఆనందం...
వచ్చేనెలలోనే అమరావతి పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ప్రారంభమై పనులు కూడా మొదలవుతాయి. సీడ్ యాక్సె స్ రోడ్ల నిర్మాణం కూడా జరిగిపోతే రైతులకు కేటాయించిన ప్లాట్ల ధరలకు రెక్కలురావడం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే అమరావతి పనులు శరవేగంగా జరుగుతాయని తెలిసి భూమి ధరలు కొంతపెరిగాయి. ఇంకా ఒక షేప్ కు వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చిన ఫ్లాట్ల ధరలు మరింత పెరిగే అవకాశముంది. అందుకే మూడేళ్లలో రైతులకు ఇచ్చిన ప్లాట్లు కోట్ల రూపాయలు పలుకుతాయని అంచనా వేస్తున్నారు. ఎవరేమి అనుకున్నా.. ఎన్ని విమర్శలు వచ్చినా కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి అమరావతిని నిర్మించడానికే చంద్రబాబు సిద్ధమయ్యారు. దీంతో భూములిచ్చిన రైతులు మాత్రం ఖుషీగా ఉన్నారు. తమ ఇన్నేళ్ల కష్టాలు నెరవేరబోతున్నాయన్న ఆనందంలో ఉన్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ