Tirumala : తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. ఈరోజు కూడా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. అన్ని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో క్యూ లైన్లు కిక్కిరిసి పోయి కనిపిస్తున్నాయి. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల రద్దీగా మారిపోయింది. మాడవీధులు, అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదం కౌంటర్ల వద్ద భక్తులు ఎక్కువగా ఉండటంతో అక్కడ తగిన ఏర్పాట్లు చేశారు. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. ఆలస్యంగా వసతి గృహాలు దొరుకుతున్నాయి. వీటి కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుమలలో గత నాలుగు రోజుల నుంచి ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఏడాది చివరి వారం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. స్వామి వారి దర్శనానికి గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ముందుగా బుక్ చేసుకోకుండా వచ్చిన భక్తులు ఇబ్బందులు పడతారని అధికారులు చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎన్ని ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ భక్తులకు మాత్రం ఇక్కట్లు తప్పడం లేదు. క్యూ లైన్ లో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. తిరుమలను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా అనేక చోట్ల అవస్థలు పడుతున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ