Chandrababu : నేడు చంద్రబాబు సమీక్షలు ఏంటంటే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పలు శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు.;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పలు శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు సచివాలయం చేరుకోనున్న చంద్రబాబు స్టేట్ ఇన్విస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ లో పాల్గొంటారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చిన సంస్థల విషయంపై చర్చించనున్నారు.
పెట్టుబడులు పెట్టేందుకు...
అలాగే పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చిన సంస్థల పురోగతిని కూడా చంద్రబాబు అధికారులతో చర్చిస్తారు. మరింత వేగంగా పరిశ్రమలు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు ఉదయం పది గంటలకు బయలుదేరి అక్కడి నుంచి నేరుగా అమరావతిలోని సచివాలయానికి చేరుకుంటారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ