Chandrababu : ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ.. ఐదు ఫైళ్లపై సంతకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలను స్వీకరించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలను స్వీకరించారు. సాయంత్రం 4.41 గంటలకు ఆయన సచివాలయంలోని మొదటి బ్లాక్ లోని తన ఛాంబర్ లో బాధ్యతలను స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన సీఎంగా బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు. 16,347 టీచర్ పోస్టులకు సంబంధించిన డీఎస్సీ ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు. తర్వాత ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట రద్దు చేస్తూ రూపొందించిన ఫైలుపై రెండో సంతకం చేశారు. పింఛన్లు నాలుగువేల రూపాయలకు పెంచుతూ మూడో సంతకం చేశారు.
ఈ కార్యక్రమంలో...
అన్నా క్యాంటిన్ల పునుద్ధరణపై నాలుగో సంతకం చేసిన చంద్రబాబు, స్కిల్ సెన్సెస్ ఫైలుపై ఐదో సంతకం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయాడు, పయ్యావుల కేశవ్, బొండా ఉమామహేశ్వరరావులు ఉన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరానికి చేసేందుకు చంద్రబాబు సెక్రటేరియట్ కు రావడంతో ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు ఆయనకు స్వాగతం పలికారు.