Chandrababu : మరో కొత్త పథకం... వారికి గుడ్ న్యూస్.. లక్ష ఇస్తారు.. అర్హతలివే

ఆంధ్రప్రదేశ్ లో మరో పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు

Update: 2024-06-30 12:40 GMT

ఆంధ్రప్రదేశ్ లో మరో పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. మైనారిటీల కోసం దుల్హన్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద మైనార్టీలకు చెందిన యువతికి వివాహ సమయంలో లక్ష రూపాయలను అందచేయలని నిర్ణయించింది. అర్హతలు ఏమిటో కూడా స్పష్టం చేసింది. ఈ పథకం కింద మైనారిటీ యువతులకు వివాహం చేసుకున్న సమయంలో లక్ష రూపాయల నగదును ఇస్తారు. అయితే ఇందుకు కొన్ని ముఖ్యమైన నిబంధనలు పాటించాలని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

అర్హతలివే...
వివాహం చేసుకోబోయే తేదీకి ఒక నెలరోజులు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వధువు మైనార్టీ వర్గానికి చెందడంతోపాటు ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న వారు అవ్వాలి. వరుడికి 21 సంవత్సరాలు, వధువుకు 18 సంవత్సరాలు నిండాలి. వధువు తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణాల్లో రూ.2 లక్షల రూపాయల లోపు, గ్రామాల్లో రూ.1.50 లక్ష లోపు ఉండాలి. ఈ అర్హతలు ఉంటే చాలు వివాహం చేసుకున్న మైనారిటీ యువతికి లక్ష రూపాయలు అందచేస్తారు.
దరఖాస్తు చేయడం ఎలా?
వధువు, వరుడి జన్మదిన సర్టిఫికెట్లు, ఇద్దరి ఆధార్ కార్డులు, లేటెస్ట్ ఫొటోలు, పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, వివాహ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, వివాహ ఆహ్వాన పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, ఇద్దరి బ్యాంకు ఖాతాల వివరాలు, వాటి ఐఎఫ్ఎస్ సీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్, బ్యాంకు శాఖ పేరు అందించాలి. వరుడు, వధువు ఫొటోలు, ఇద్దరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, శుభలేఖ, వయసు ధ్రవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్ పత్రాలను స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి.అలాగే స్కాన్ చేసిన పత్రాలు సైజ్ తక్కువలో తక్కువగా 50 కేబీ నుంచి 150 కేబీ వరకు ఉండాలి. వెబ్ సైట్ ప్రారంభం కాగానే ప్రభుత్వం పోర్టల్ తెరవబోతోంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న తర్వాత స్థానిక తహశీల్దార్ కు వీటిని పంపించాలి. ఆయన మైనార్టీల సంక్షేమ అధికారికి వాటిని పంపిస్తారు. అందుకు వారం రోజుల సమయం తీసుకుంటారు. తర్వాత జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఆన్ లైన్ లో డబ్బులు ఇస్తారు. వివాహానికి పదిరోజులు ముందుగా వధువు ఖాతాలో జమవుతాయని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News