ఎల్లుండి కోనసీమకు జగన్

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఈ నెల 26వ తేదీ ఆయన కోనసీమ జిల్లాలో పర్యటిస్తారు;

Update: 2022-07-24 02:46 GMT
ఎల్లుండి కోనసీమకు జగన్
  • whatsapp icon

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఈ నెల 26వ తేదీ ఆయన కోనసీమ జిల్లాలో పర్యటిస్తారు. కోనసీమ జిల్లాలోని పి. గన్నవరం, రాజోలు మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటించనున్నారు. అధికారులు ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వరద కారణంగా నష్టపోయిన ప్రాంతాలతో పాటు పంటలను కూడా జగన్ పరిశీలించనున్నారు.

వరద బాధితులతో.
పి. గన్నవరం నియోజకవర్గంలోని బూరుగులంక, ఊడిమూిలంక, అరిగెలవారి పేట, జి.పెదపూడి లంక గ్రామాల్లో వరద నష్టాన్ని జగన్ పరిశీలించనున్నారు. పంటలను కూడా పరిశీలించి అక్కడి రైతులకు భరోసా ఇవ్వనున్నారు. వరద బాధితులతో జగన్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అందుకు ముఖాముఖి కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వరద సాయం అందిన తీరుపై కూడా జగన్ ఆరా తీయనున్నారని తెలిసింది.


Tags:    

Similar News