టీడీపీ - వైసీపీ నేతల మధ్య ఘర్షణ.. మద్దూరు సెంటర్లో టెన్షన్

గుంటూరు జిల్లా వేదికగా ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఫలితంగా అమరావతిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అమరావతిలో

Update: 2022-01-23 12:03 GMT

టీడీపీ - వైసీపీ నేతల మధ్య ఘర్షణలు మరోసారి తెరపైకొచ్చాయి. గుంటూరు జిల్లా వేదికగా ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఫలితంగా అమరావతిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అమరావతిలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య మాటలయుద్ధం జరిగింది. అవినీతిపై చర్చకు రావాలంటూ సవాళ్లు.. ప్రతి సవాళ్లు విసురుకున్నారు. సవాళ్లు కాస్తా.. ఘర్షణకు దారితీశాయి. ఈ ఘర్షణలతో స్థానిక మద్దూర్ సెంటర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని ఘర్షణకు దిగిన ఇరు పార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. గుడివాడలో క్యాసినో పై రచ్చ జరుగుతూనే ఉంది. జనవరి 21న క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ గుడివాడకు వెళ్లడం, దానికి నిరసనగా వైసీపీ శ్రేణులు తీసిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్లు విసురుకోవడంతో గుడివాడ వీధులు అట్టుడికి పోయాయి. టీడీపీ నేత బోండా ఉమాపై హత్యాప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ఆ తర్వాత మంత్రి కొడాలి నాని సవాల్ చేయడం.. అందుకు బోండా ఉమా ప్రతి సవాల్ చేయడం తెలిసిందే.



Tags:    

Similar News