నేడు వర్మ క్వాష్ పిటీషన్ పై విచారణ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పిటీషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది

Update: 2024-12-02 03:59 GMT

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పిటీషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై నమోదయిన అన్ని కేసులను క్వాష్ చేయాలని వర్మ పిటీషన్ వేశారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినందుకు నిరసనగా ఏపీలోని పలు చోట్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి.

తనపై కేసులన్నీ...
ప్రకాశం, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో వర్మపై కేసులు నమోదయ్యాయి. మద్దిపాడు పోలీసులు విచారణకు పిలిచినా రామ్ గోపాల్ వర్మ హాజరు కాలేదు. ఆయన కోసం హైదరాబాద్ వచ్చిన పోలీసులు సెర్చి వారెంట్ లేకపోవడంతో వెనుదిరిగారు. ఈ రోజు వర్మ పిటీషన్ పై విచారణ జరిగి ఉత్తర్వులు వెలువడిన తతర్వాత పోలీసులు చర్యలకు దిగే అవకాశముందని చెబుతున్నారు.


Tags:    

Similar News