Tirumala : రష్ బాగా తగ్గింది.. రీజన్ ఇదే
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు.
Tirumala Update:తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. వసతి గృహాలు కూడా సులువుగానే భక్తులకు దొరుకుతున్నాయి. స్వామి వారి దర్శనం కూడా త్వరగానే లభిస్తుండటంతో భక్తులు తన్మయత్వంతో గోవింద నామ స్మరణ చేస్తూ ముందుకు సాగుతున్నారు. పరీక్షల సీజన్ కావడంతో ఎక్కువ మంది తిరుమలకు వచ్చే అవకాశం లేదు. అదే సమయంలో ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రమే తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. మూడు వందల రూపాయల టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం కేవలం గంటలోనే పూర్తవుతుంది.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 64,802 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,695 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. హుండీ ఆదాయం నిన్న 3.66 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. నేడు తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఒక కంపార్ట్‌మెంట్ లోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రవేశించిన భక్తులకు స్వామి వారి దర్శనం ఎనిమిది గంటల సమయంలో పూర్తవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.