Tirumala : నేరుగా దర్శనానికి.. క్యూ లైన్ లో వేచి ఉండకుండానే
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. నేడు క్యూ లైన్‌లలో వేచి ఉండకుండానే నేరుగా స్వామి వారిని దర్శించుకునే వీలుంది
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. నిన్నటి వరకూ కొత్త ఏడాదితో పాటు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి ఆరు లక్షల మందికి పైగానే భక్తులు హాజరయ్యారు. స్వామి వారిని దర్శించి కానుకలను సమర్పించారు. అయితే ఈరోజు మాత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. ఇక పబ్లిక్ పరీక్షలకు సమయం దగ్గరపడటంతో పాటు సెలవులు ముగియడంతో పాటు బుధవారం కావడంతో తిరుమలలో క్యూ లైన్లన్నీ భక్తులు లేక వెలవెల బోతున్నాయి. సర్వదర్శనం క్యూ లైన్‌లో టోకెన్లు లేని భక్తులకు దర్శనం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల సమయం మాత్రమే పడుతుంది.
హుండీ ఆదాయం...
స్వామి వారి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి చూడకుండానే నేరుగా స్వామి వారిని ఈరోజు దర్శనం చేసుకునే వీలుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి గంటలోనే దర్శనం పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,712 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 19,902 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.97 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.