తిరుమలలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈరోజు ఉదయం ఆరు గంటల సమయానికి 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Update: 2022-09-08 02:51 GMT

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈరోజు ఉదయం ఆరు గంటల సమయానికి 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠం క్యూ క్లాంపెక్స్ లోని 25 కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీరికి సర్వదర్శనం పది గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది.

హుండీ ఆదాయం....
నిన్న తిరుమల శ్రీవారిని 69,115 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,720 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.93 కోట్ల రూపాయలు అని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News