Tirumala : తిరుమలలో బాగా తగ్గిన రద్దీ... శనివారం దర్శన సమయం ఎంతంటే?

తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. శనివారం అయినా భక్తుల రద్దీ తక్కువగానే ఉంది

Update: 2024-12-21 02:43 GMT

తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. శనివారం అయినా భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. కంపార్ట్ మెంట్లలో వేచి ఉండకుండానే నేరుగా స్వామి వారిని దర్శించుకునే వీలు నేడు కలుగుతుంది. శనివారం నాడు తిరుమలలో సహజంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది నిన్నటి వరకూ భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న తిరుమల ఒక్కసారిగా బోసిపోయినట్లు కనిపించింది. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి ఇష్టమైన రోజు శనివారం కావడంతో ఆరోజు ఎక్కువ మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు తరలి వస్తారు. అయితే నేడు భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారులు చేసిన హెచ్చరికలతో భక్తుల రద్దీ తక్కువగా ఉందని భావించవచ్చు. మరోవైపు శనివారం రద్దీ ఎక్కువగా ఉంటుందని స్వామి వారి చెంతకు వచ్చేందుకు భక్తులు కొంత వెనకడుగు వేయడంతోనే శనివారం భక్తుల రద్దీ తక్కువగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. శనివారం రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి అన్ని చర్యలు తీసుకున్నా భక్తులు అంతంత మాత్రంగానే ఉండటంతో అధికారులే ఆశ్చర్యపోతున్నారు. మాడ వీధులన్నీ భక్తులు పెద్దగా లేక బోసి పోయి కనిపిస్తున్నాయి.



వైకుంఠ ఏకాదశి టిక్కెట్లు....

వైకుంఠ ఏకాదశి టికెట్ల విడుదలలో మార్పులను టీటీడీ చేసింది. డిసెంబర్ 23 తేదీన ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల చేయనుంది. డిసెంబర్ 24 తేదీన ఉదయం 11 గంటలకు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా టిక్కెట్లు విడుదల చేయనున్నారు. మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు టికెట్లు,రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కోటలో మార్పు డిసెంబర్ 25 తేదీన ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్లను విడుదల చేయనున్నారు. డిసెంబర్ 26 తేదీన ఉదయం 11 గంటలకు మూడు వందల రూపాయల టికెట్లు విడుదల చేయనున్నారు. డిసెంబర్ 26 తేదీన సాయంత్రం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చేయనున్నారు.
ఖాళీగానే కంపార్ట్ మెంట్లు...
ఇక శనివారం రద్దీ తక్కువగా ఉండటంతో వైకుంఠం కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు ఖాళీగానే ఉన్నాయి. కంపార్ట్ మెంట్లలో వేచి ఉండకుండానే నేరుగా శ్రీవారి దర్శనం భక్తులు నేడు చేసుకుంటున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులు ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించినా శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం మాత్రమే పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవువుతంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 65,299 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 20,297 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.75 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.




Tags:    

Similar News