టన్నుల కొద్దీ బియ్యం కాకినాడ పోర్టుకు

రేషన్‌ మాఫియాకు దేశవ్యాప్త చిరునామాగా కాకినాడ మారింది.

Update: 2024-12-20 06:35 GMT

రేషన్‌ మాఫియాకు దేశవ్యాప్త చిరునామాగా కాకినాడ మారింది. రాష్ట్రంలోని జిల్లాలే కాదు.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి నుంచీ పేదల బియ్యం అక్రమనిల్వలు కాకినాడ పోర్టుకు చేరుతున్నాయి. కాకినాడ పోర్టుల ద్వారా గతఐదేళ్లలో వేల టన్నుల రేషన్ బియ్యం పశ్చిమ ఆఫ్రికాలోని వివిధదేశాలకు ఓడల్లో వెళ్లిపోయాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

137 మందిని గుర్తించి...
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ ఫిర్యాదుతో పదమూడు కేసుల్లో 137 మిల్లుల పాత్రను అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వం కాకినాడ పోర్టు వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. రేషన్ బియ్యం విదేశాలకు తరలి పోకుండా అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. అవసరమైతే వారిపై పీడీ యాక్ట్ ను పెట్టేందుకు కూడా వెనకాడవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి.




 


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News