Pawan Kalyan : నేడు కూడా ఏజెన్సీ ఏరియాలో పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తారు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్ పలు రహదారులకు శంకుస్థాపనలు చేశారు. గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెలలో రెండు మూడు రోజులు ఏజెన్సీ ప్రాంతాలకు వస్తానని గిరిజనులకు మాట ఇచ్చారు.
గిరిజన ప్రాంతాల్లో...
గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాన్ని ఏర్పాటు చేసి దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు అవసరమైన నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగరువులో పర్యటిస్తారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడమే కాకుండా వాటి పనులను కూడా ప్రారంభిస్తుండటంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.