పొంచి ఉన్న మోచా ముప్పు

తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది

Update: 2023-05-07 03:21 GMT

తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. ఎల్లుండి వాయుగండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అల్పపీడనంగా మారి రేపు వాయుగుండంగా మారుతుందని తెలిపింది. తుఫానుగా మారే అవకాశముందని తెలిపింది. ఈ తుఫానుకు ఇప్పటికే వాతావరణ శాఖ మోచా అని నామకరణం చేశారు.

తీర ప్రాంత జిల్లాలు...
ఈ ప్రభావం ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీర ప్రాంత జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మోచా తుపాను దిశను మార్చుకుంటే కోస్తాంధ్రపై కూడా ప్రభావం చూపే అవకాశముందని తెలిపింది. ఈ ప్రభావంతో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశముందని హెచ్చికలు జారీ చేసింది. మత్స్యకారులు ఎవరూ చేపలవేటకు సముద్రంలోకి వెళ్లవద్దని వార్నింగ్ ఇచ్చింది. ఈ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని కూడా తెలిపింది.


Tags:    

Similar News