Pawan Kalyan : పిఠాపురానికి పవన్ కల్యాణ్ మూడు రోజులు అక్కడే
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ‌్ పిఠాపురం నియోజకవర్గం పర్యటన ఖరారయింది
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ‌్ పిఠాపురం నియోజకవర్గం పర్యటన ఖరారయింది. ఆయన గెలిచిన తర్వాత ఇంత వరకూ పిఠాపురం వెళ్లలేదు. దీంతో పిఠాపురం వెళ్లాలని పవన్ నిర్ణయించుకున్నారు. సోమవారం మంత్రివర్గ సమావేశం ఉండటంతో ఆరోజు వీలు కాదు. మంగళ వారం నుంచి ఆయన పర్యటన పిఠాపురంలో సాగే అవకాశముందని తెలిసింది.
అక్కడే మకాం...
మొత్తం మూడు రోజుల పాటు పవన్ కల్యాణ‌్ పిఠాపురంలోనే మకాం వేయనున్నారు. అక్కడే ఉండి ప్రజలను కలుసుకుంటారు. వారి ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకుంటారు. పవన్ పిఠాపురం పవన్ కల్యాణ్ పర్యటన ఖరారు కావడంతో ఆయనకు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి, ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలిసారి వస్తున్న పవన్ కు భారీగా స్వాగతం చెప్పేందుకు జనసేన నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.