రద్దీ తగ్గడం లేదు.. శ్రీవారి దర్శనానికి ఎన్నిగంటలు పడుతుందంటే..
శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. టోకెన్ రహిత సర్వదర్శనానికి..
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా ఐదోరోజు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. టోకెన్ రహిత సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్ లోని 27 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది.
కాగా.. నిన్న(జూన్ 5) శ్రీవారిని 79,974 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారిలో 37,052 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శనివారం స్వామివారికి రూ.3.77 కోట్ల హుండీ ఆదాయం సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది. కాగా.. తిరుమలకు వచ్చే భక్తులకు అన్నపానీయాలకు లోటు లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు అందుబాటులో త్రాగునీరు, అన్నప్రసాద వితరణ కేంద్రాలను ఉంచింది.