మార్గదర్శకాలను మార్చాల్సందే..ఎన్నికల కమిషన్ కు పేర్ని నాని సూచన
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపుపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన మాదర్శకాలపై మాజీ మంత్రి పేర్ని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపుపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ప్ర ప్రత్యేక మార్గదర్శకాలపై మాజీ మంత్రి పేర్ని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో లేని సడలింపులు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఇచ్చారంటూ పేర్ని నాని ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించారు.
ఆ పార్టీ కోరిన వెంటనే...
ఒక పార్టీ కోరగానే ఇలాంటి గైడ్ లైన్స్ ఎలా ఇస్తారన్న పేర్ని నాని ఎక్కడా లేని సర్క్యులర్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు.ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని తామ కోరుతున్నామన్నారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరించడం ఎన్నికల కమిషన్ కు తగదని పేర్ని నాని అన్నారు.