Alla Nani : నేడు టీడీపీలో చేరనున్న ఆళ్లనాని
ఏలూరు నియోజకవర్గం నేత ఆళ్ల నాని నేడు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.
ఏలూరు నియోజకవర్గం నేత ఆళ్ల నాని నేడు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. ఆళ్లనానికి చంద్రబాబు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించనున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని కొద్ది రోజుల క్రితం పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు.
వాయిదా పడి...
ఆళ్ల నాని చేరికపై కార్యకర్తల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎప్పుడో ఆళ్లనాని పార్టీలో చేరాల్సి ఉండగా కార్యకర్తల అభ్యంతరాలతో వాయిదా వేశారు. స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటికి కార్యకర్తలను సముదాయించే బాధ్యతలను అధినాయకత్వం అప్పగించింది. ఈరోజు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆళ్ల నాని చేరతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now