జగన్, అదానీపై చర్యలు తీసుకోవాలన్న వైఎస్ షర్మిల
ఛలో రాజ్ భవన్‌ను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని వైఎస్ షర్మిల అన్నారు
అదానీపై చర్యలు తీసుకోవాలని ఏపీసీసీ నిర్వహించిన ఛలో రాజ్ భవన్‌ను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని వైఎస్ షర్మిల అన్నారు. అదానీ, జగన్ మధ్య ముడుపుల వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేల్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యాన్ని వహిస్తున్నాయన్నారు. స్వయంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రికి అదానీ గ్రూప్స్ 1750 కోట్లు లంచాలు ఇచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్ బి ఐ రిపోర్టు ఇస్తే.. కేంద్రంలో మోడీ , రాష్ట్రంలో చంద్రబాబుకనీసం నోరు విప్పడం లేదన్నారు. విచారణ సైతం జరిపించడం లేదన్నారు. ఎక్స్ లో వైఎస్ షర్మిల స్పందించారు.
చంద్రబాబు కూడా...
అదానీ మీద ఈగ కూడా వాలనివ్వడం లేదని అన్న వైఎస్ షర్మిల అదానీ దేశం పరువు, ఖ్యాతిని ప్రపంచం ముంగిట తీస్తే లంచాలు తీసుకొని వైసీపీ అధినేత జగన్ మన రాష్ట్రం పరువు తీశారన్నారు. స్వలాభం కోసం విద్యుత్‌ను ఎక్కువ రేటు పెట్టీ కొని జనం నెత్తిన రూ.1.50లక్షల కోట్ల భారం వేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇదో పెద్ద కుంభకోణం అని గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు మోడీకి, అదానీకి భయపడి మౌనం పాటిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని, ఇప్పటికైనా అదానీపై విచారణకు వెంటనే జేపీసీ వేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now