నెల్లూరు జిల్లాలో జికా వైరస్?
నెల్లూరు జిల్లాలో ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ సోకినట్లు అనుమానం కలగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం రేపింది. మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి వైరస్ సోకినట్లు అనుమానం కలగడంతో కుటుంబసభ్యులు, అధికారులు అప్రమత్తమయ్యారు. అతనికి నెల్లూరులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. వైరస్ నిర్ధారణ తరువాత చెన్నైలోని ఆసుపత్రికి తరలించే అవకాశాలున్నాయి.
వెంకటాపురం గ్రామంలో...
ఈ నేపథ్యంలో వెంకటాపురంలో నేడు రాష్ట్ర వైద్యుల బృందం పర్యటించనుంది. బాలుడికి సోకింది జికా వైరస్సా? కాదా? అని నిర్ధారించనున్నారు. ఒకవేళ జికా వైరస్ అని తేలితే మాత్రం గ్రామంలో ఈ వైరస్ మరొకరికి సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అదే సమయంలో ప్రజలను కూడా అప్రమత్తం చేయనున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ