Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలంటే?
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల 10వ తేదీన వైకుంఠ ఏకాదశి జరుగుతుందని, ఈ సందర్భంగా జనవరి పది నుంచి 19వ తేదీ వరకూ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం అందుబాటులో ఉంటుంది. ఉత్తర ద్వార దర్శనం నుంచి పది రోజులు పాటు శ్రీవారిని దర్శించుకునే వీలుంది.
ఈ నెల 23వ తేదీన...
వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతి లేదు. అలాగే స్పెషల్ దర్శనాలను కూడా అనుమతించమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు అయితే ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శన టికెట్స్ విడుదల చేయనున్నట్లు తెలిసింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now