అమరావతి ఉద్యమానికి తాత్కాలిక బ్రేక్
రాజధాని అమరావతి ఉద్యమానికి తాత్కాలిక విరామాన్ని రైతులు ప్రకటించారు
రాజధాని అమరావతి ఉద్యమానికి తాత్కాలిక విరామాన్ని రైతులు ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా విరామం ఇస్తున్నట్లు రైతులు ప్రకటించారు. దాదాపు 1,560 రోజులుగా సాగుతునన అమరావతి ఉద్యమానికి రైతులు విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. అయతే ఇళ్ల వద్ద ఉండే తమ నిరసనలు కార్యక్రమాలు చేపడతమాని వారు తెలిపారు.
మూడు రాజధానుల ప్రతిపాదనను...
తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్న అమరావతి జేఏసీ నేతలు తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ అమరావతి ప్రాంత రైతులు ఈ ఉద్యమాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ వారు వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమానికి దిగారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో తాత్కాలిక విరామం ప్రకటించారు.