పులి మృతి ఘటనలో నలుగురు అధికారుల సస్పెన్షన్
పులి మృతి చెందిన ఘటనలో కర్నూలు జిల్లాలో నలుగురు అటవీ శాఖ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది
పులి మృతి చెందిన ఘటనలో కర్నూలు జిల్లాలో నలుగురు అటవీ శాఖ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని మృతి చెందిన పులిని ఫారెస్ట్ అధికారులు మాయం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిగింది. ఇందులో సెక్షన్ అధికారి శ్రీనివాసరెడ్డి, బీట్ ఆఫీసర్ జేమ్స్ పాల్ ను సస్పెండ్ చేశారు. వీరితో పాటు ప్లాంటేషన్ వాచ్ మెన్ భాషా, మైకేల్ ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు.
మాయం చేసేందుకు....
వేటగాళ్ల ఉచ్చులో చిక్కకుని నలమల అటవీ ప్రాంతంలో పులి మరణించింది. అయితే పులి మరణించిందన్న వార్త బయటకు పొక్కి తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని భావించిన అటవీ శాఖ అధికారులు దానిని మాయం చేశారు. తెలుగు గంగ కాలవలో పెద్ద పులి కళేబరం కనిపించడంతో దీనిని మాయం చేసేందుకు తెలుగు గంగ కాల్వ అటవీ అధికారులు ప్రయత్నించారని విచారణలో తేలింది. దీంతో నలుగురు ఫారెస్ట్ అధికారులు, సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది.