నేటి నుంచి ఏపీలో ఉచిత బియ్యం

ఏపీలో ఈరోజు నుంచి ఉచిత బియ్యాన్ని పేదలకు అందించనుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఈ బియ్యాన్ని అందచేయనున్నారు

Update: 2023-01-01 04:15 GMT

ఏపీలో ఈరోజు నుంచి ఉచిత బియ్యాన్ని పేదలకు అందించనుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఈ బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు అందచేయనున్నారు. ఇప్పటి వరకూ రూపాయికి కిలో బియ్యాన్ని అందిస్తున్న ప్రభుత్వం ఏడాది పాటు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈఏడాది డిసెంబరు వరకూ ఉచిత బియ్యాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

1.46 కోట్ల మందికి...
దీనివల్ల 1.46 కోట్ల మంది లబ్దిదారులు ప్రయోజనం పొందనున్నారు. ఆహార భద్రత చట్ట కిందకు వచ్చే లబ్దిదారులందరికీ ఏడాది పాటు ఉచితంగా ఇవ్వాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఆహారభద్రత చట్టం కిందకు రాని వారికి కూడా ఉచితంగా ఏడాది పాటు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ప్రజలు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే రేషన్ దుకాణాల నుంచి బియ్యాన్ని అందుకోవచ్చని తెలిపింది.


Tags:    

Similar News