Andhra Pradesh : నేటి తెల్లవారు జాము నుంచే పింఛన్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ లో నేడు తెల్లవారు జాము నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది

Update: 2024-11-30 02:49 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేడు తెల్లవారు జాము నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు స్వయంగా హాజరై లబ్దిదారులకు స్వయంగా పంపిణీ చేస్తున్నారు. సచివాలయం సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది కూడా ఈ పింఛన్ల పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. వీలయినంత త్వరగా పింఛన్లు పంపిణీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

రేపు పంపిణీ చేయాల్సి ఉన్నా...
డిసెంబరు 1వ తేదీ పింఛను పంపిణీ చేయాల్సి ఉన్నా ఆదివారం కావడంతో శనివారం అంటే నవంబరు 30వ తేదీన పింఛన్ల పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన నిధులను కూడా విడుదల చేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ది దారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. వృద్ధులు, వితంతువులకు నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు ఆరు వేల రూపాయల చొప్పున పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొనాలని అధినాయకత్వం ఆదేశించారు.


Tags:    

Similar News