Andhra Pradesh : మద్యం ప్రియులకు కిక్కించే న్యూస్.. అక్టోబరు నుంచి అమలు
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబరు నుంచి ఆంధ్రప్రదేశ్ లో నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకురానుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబరు 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకువచ్చేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటి వరకూ గత ప్రభుత్వం ప్రభుత్వం ద్వారా మద్యం దుకాణలను నిర్వహించేది. ఇకపై కొత్త ఎక్సైజ్ విధానంలో ప్రయివేటు వ్యక్తులకు ఆక్షన్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. మద్యం దుకాణాల సంఖ్యకూడా పెరిగే అవకాశముంది.
తక్కువ ధరకు....
ఎందుకంటే రాష్ట్ర ఖజానాకు అత్యధిక ఆదాయం తెచ్చి పెట్టేది మద్యం అమ్మకాల నుంచే. ప్రభుత్వం తరుపున అమ్మకాలు నిలిపివేసి ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తే వారు ఎక్కువ ధరకు వేలం పాటలో పాడుకుని ఏడాదికి ఇంత మొత్తాన్ని చెల్లించే అవకాశముంటుంది. ఇది పాత విధానమే. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో నుంచి మద్యం దుకాణాలను తీసేసి ప్రభుత్వం మాత్రమే అమ్మకాలు చేసేలా నిర్ణయం తీసుకుంది. ధరలను కూడా విపరీతంగా పెంచింది.
నాణ్యమైన బ్రాండ్లు...
ఇక ఏపీ ప్రభుత్వం తెచ్చే నూతన ఎక్సైజ్ విధానంలో ధరలు కూడా తగ్గించాలని నిర్ణయించింది. తక్కువ ధరలకే నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేసేలా చర్యలు తీసుకునేలా పాలసీని రూపొందిస్తుంది. అన్ని నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటుంది. బ్రాంది, విస్కీ, బీరుల్లో గతంలో ఉన్న బ్రాండ్లను ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్న బ్రాండ్లను విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. తక్కువ ధరకు మద్యం అమ్మకాలు చేయడంతో పాటు ఆదాయాన్ని పెంచుకునేలా కొత్త ఎక్సైజ్ పాలసీలో కసరత్తును ప్రభుత్వం చేస్తున్నట్లు తెలిసింది.