Andhra Pradesh : పింఛను అనర్హుల గుర్తింపునకు మార్గదర్శకాలివేనట
ఆంధ్రప్రదేశ్‌లో అనేకులు అనర్హులు కూడా పింఛను పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఏరివేతకు మార్గదర్శకాలను రూపొందిచింది
ఆంధ్రప్రదేశ్‌లో అనేక మంది అనర్హులు కూడా పింఛను పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే ఎన్టీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పింఛనును నాలుగు వేల రూపాయలకు పెంచింది. వృద్ధులు, వితంతువులకు నెలకు నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు, దీర్ఘకాలిక రోగులకు పది వేల రూపాయల పింఛనును ప్రతి నెల మొదటి తేదీన ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛను పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల ఒకటో తేదీన చెల్లించాలని అధికారులను ఆదేశించడంతో అప్పటి నుంచి అదే తరహాలో పంపిణీ జరుగుతుంి. దాదాపు 69 లక్షల మందికి పైగానే వృద్ధులు, వితంతువులు పింఛనును ప్రతి నెల అందుకుంటున్న నేపథ్యంలో అనర్హులు కూడా అనేక మందికి పింఛను అందుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయింది.