Andhra Pradesh : కొత్త రేషన్ కార్డుదారులకు చంద్రబాబు గుడ్ న్యూస్... వచ్చే నెల నుంచి దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్‌ కార్డులు మంజూరుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది.

Update: 2024-11-25 07:50 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్‌ కార్డులు మంజూరుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబరు రెండో తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. డిసెంబరు 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈలోపు దరఖాస్తులను అర్హులైన వారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైన వారిని పరిశీలించిన తర్వాత ఎవరెవరికి? తెలుపు రంగు రేషన్ కార్డులు మంజూరు చేయాలన్న దానిపై అధికారులు ఒక నిర్ణయానికి వస్తారు. సంక్రాంతి పండగ లోపు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన లబ్ది దారులను గుర్తించే ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

తెలుపు రంగు కార్డు కోసం...
ఈ మేరకు చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలుపు రంగు రేషన్ కార్డులుంటేనే అన్ని సంక్షేమ పథకాలు అందుతాయి. ఇప్పటి వరకూ గ్యాస్ సిలిండర్ కూడా ఉచితంగా పొందాలంటే తెలుపు రంగు రేషన్ కార్డు అవసరం. ఇప్పటికే ఏపీలో 1.66 కోట్ల మంది రేషన్ కార్డుదారులున్నారు. వీరిలో తెలుపు రంగు రేషన్ కార్డులందరూ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, సూపర్ సిక్స్ హామీలకు అర్హత సాధించిన జాబితాలో ఉంటారు. గత కొంత కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం వేల సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. పెళ్లిళ్లయి కొత్త జంటలు వేరు కాపురం పెట్టడంతో పాటు కొత్తగా వచ్చే వారికి ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటు కొంత ఉపశమనం కలిగించేలా కనిపిస్తుంది.
సంక్షేమ పథకం అందుకోవాలంటే?
ఏ ప్రభుత్వ పథకం అయినా అందుకోవాలంటే అందుకు రేషన్ కార్డు తప్పనిసరి. అందుకే అందరూ రేషన్ కార్డుల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిశీలించి అర్హులైన వారికి తెలుపు రంగు రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు. దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. పింఛన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు అందుకోవాలంటే తమకు తెలుపు రంగు రేషన్ కార్డులు అవసరమని ఎక్కువ మంది ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలోనూ కార్యకర్తల నుంచి వచ్చే వినతుల్లోనూ తెలుపు రంగు రేషన్ కార్డులకు సంబంధించిన సమస్యలే ఉండటంతో ప్రభుత్వం సంక్రాంతి నాటికి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని భావిస్తుంది.


Tags:    

Similar News