గుడ్ న్యూస్.. వారికి రాజధాని ప్రాంతంలో ఇళ్లస్థలాలు

రాజధానిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడానికి చేసిన చట్ట సవరణకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదించారు.;

Update: 2022-10-20 07:33 GMT

రాజధానిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడానికి చేసిన చట్ట సవరణకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదించారు. సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ చట్టాల సవరణకు ఆమోదముద్ర వేస్తూ గవర్నర్ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది.

గవర్నర్ నోటిఫికేషన్...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఇళ్ల పథకాలు కేవలం రాజధాని ప్రాంతం వారికి మాత్రమే కాకుండా, ఇతర జిల్లాల్లోని అర్హులైన పేదలకు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక అధికారికి ఈ విషయంలో పాలకవర్గంతో పాటు నిర్ణయం తీసుకునేలా చట్టాన్ని సవరించింది. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ లో మార్పులు, చేర్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తూ గవర్నర్ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది.


Tags:    

Similar News