Srikanth : నాలాగా ఉండటం వల్లనే పొరపాటుపడినట్లుంది
తాను ఎలాంటి రేవ్ పార్టీలకు వెళ్లలేదని హీరో శ్రీకాంత్ తెలిపారు. తనపై కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.;
తాను ఎలాంటి రేవ్ పార్టీలకు వెళ్లలేదని హీరో శ్రీకాంత్ తెలిపారు. తనపై కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను హైదరాబాద్ లోని తన ఇంట్లోనే ఉన్నట్లు శ్రీకాంత్ తెలిపారు. హైదరాబాద్ లోని తన ఇంటి నుంచే ఆయన వీడియోను షూట్ చేసి విడుదల చేశారు. తాను బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నాననే ప్రచారం అవాస్తవమని హీరో శ్రీకాంత్ తెలిపారు.
ఆ అలవాటు లేదు...
తనకు రేవ్ పార్టీలకు వెళ్లే అలవాటు లేదన్నారు. ఈ వార్తలను చూసి తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా నవ్వుకున్నామని అన్నారు. అయితే బెంగళూరులో దొరికిన వారిలో ఒకరు తనలా ఉండటం వల్లనే పొరపాటు పడి ఉండవచ్చని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. తాను ఎలాంటి పార్టీలకు వెళ్లలేదని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నానని తెలిపారు.