బాలయ్య దానిపై ఎందుకు రియాక్ట్ కాలేదో?
కొత్త జిల్లాల ఏర్పాటును హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వాగతించారు.
కొత్త జిల్లాల ఏర్పాటును హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వాగతించారు. హామీ ఇచ్చిన మాదిరిగానే ప్రతి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లాను చేయాలని నందమూరి బాలకృష్ణ అన్నారు. అయితే హిందూపురంను సత్యసాయి జిల్లాలో జిల్లా కేంద్రంగా చేయాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. హిందూపురం పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందిందని బాలకృస్ణ చెప్పారు.
హిందూపురంను....
హిందూపురంను జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేయాలని నందమూరి బాలకృష్ణ కోరారు. హిందూపురంలో జిల్లా కార్యాలయాలకు అవసరమైన ప్రభుత్వ భూమి ఉందని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటులో రాజకీయాలు లేకుండా పూర్తి పారదర్శకతను పాటించాలని నందమూరి బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే సత్యసాయి జిల్లాపై స్పందించిన నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పేరిట ఏర్పాటు చేస్తున్న జిల్లా పై మాత్రం రియాక్ట్ కాలేదు.