వంద కోట్ల మార్క్ దాటిన హుండీ ఆదాయం

తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం గత నెల కూడా వంద కోట్ల రూపాయలు దాటింది.

Update: 2022-12-02 05:47 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం గత నెల కూడా వంద కోట్ల రూపాయలు దాటింది. వరసగా తొమ్మిదో నెలలో శ్రీవారి ఆదాయం వంద కోట్లు దాటినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. భక్తుల సంఖ్య ప్రతి రోజూ 70 వేలకు పైగా ఉండటం, నాలుగు కోట్ల రూపాయల హుండీ ఆదాయం ప్రతి రోజూ లభిస్తుండటంతో నవంబర్ నెలలో కూడా 127.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

9 నెలల నుంచి...
కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాత భక్తులు ప్రతి రోజూ తిరుమలకు చేరుకుంటున్నారు. వారం, సెలవులతో సంబంధం లేకుండా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ ఏడాది మార్చి నెల నుంచి భక్తుల సంఖ్య ప్రతి రోజూ పెరుగుతూనే ఉంది. తిరుమల కొండ ఏడుకొండల వాడి నామస్మరణతో మారుమోగుతుంది. అందుకే ఆదాయం నెలకు వంద కోట్లకు పైగానే వస్తుందని, భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని వసతులు, అన్నదానం వంటి సౌకర్యాలను కూడా పెంచారు. ఈ ఏడాది జులై నెలలో అత్యధికంగా 139.35 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.


Tags:    

Similar News