వైసీపీ సర్కార్‌పై జనసేనాని సెటైర్లు

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధిననేత పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. ఆయన వైసీపీ ప్రభుత్వం వ్యవహారశైలిపై ట్వీట్ చేశారు.;

Update: 2023-04-14 06:10 GMT

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధిననేత పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. ఆయన వైసీపీ ప్రభుత్వం వ్యవహారశైలిపై ట్వీట్ చేశారు. రిషికొండ తవ్వకాలను కప్పిపుచ్చేందుకు 151 అడుగుల స్టిక్కర్లు అంటిస్తారా అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. చెట్ల నరికివేత, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం కొండలను తొలగించడం వైసీపీ దుష్ట పాలకుల ముఖ్యలక్షణమని పవన్ కల్యాణ్ అన్నారు.

సర్కార్ ఉల్లంఘనలు...
వైసీపీ సర్కార్ ఉల్లంఘించిన నిబంధనలను నిపుణుల ప్యానెల్ నిర్ధారించిందని పేర్కొన్నారు. దీనికి జగన్ ప్రభుత్వం సమాధానం చెబుతుందా అని ప్రశ్నించారు. లేక రుషికొండ గ్రీన్ మ్యాట్‍పై 151 అడుగుల స్టిక్కర్ అంటిస్తారా? జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సెటైర్ వేశారు.


Tags:    

Similar News