మరో తుపాను ముప్పు

ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఈ అల్పపీడనం ఎల్లుండి తుపానుగా మారనుంది.

Update: 2022-12-14 03:56 GMT

ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఈ అల్పపీడనం ఎల్లుండి తుపానుగా మారనుంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలో సుమిత్ర జలసంధిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

మాండూస్ నుంచి కోలుకోక ముందే...
ఇప్పటికే మాండూస్ తుపాను కారణంగా ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మంచు కూడా కురుస్తుంది. చలిగాలులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తుపాను ప్రభావంతో మరో మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మాండూస్ తుపానుతో నష్టపోయి ఇంకా తేరుకోక ముందే మరో తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు ప్రజలను భయపెడుతున్నాయి.


Tags:    

Similar News