Nara Loksh : రెండో రోజు లోకేష్ ప్రజా దర్బార్

మంత్రి నారా లోకేష్ రెండో రోజు కూడా రాష్ట్రంలో వివిధ వర్గాల వారు కలసి వినతులను స్వీకరించారు.

Update: 2024-06-16 07:17 GMT

మంత్రి నారా లోకేష్ రెండో రోజు కూడా రాష్ట్రంలో వివిధ వర్గాల వారు కలసి వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం లోకేష్ ప్రజాదర్బార్ ను చేపట్టారు. నిన్నటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమయింది. మంగళగిరి ప్రజలు వచ్చి లోకేష్ కు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. శనివారం నుంచి ప్రారంభమయిన ఈ కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగింది.

వినతి పత్రాలు ఇచ్చి...
ఈ రోజు డీఎస్సీ 2008, జీవో నెంబరు 39 ప్రకారం ఎంటీఎస్ లో కాంటాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2,193 మంది ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ లోకేష్ కు వినతి పత్రాన్ని సమర్పించింది. దీంతో పాటు అనేక మంది లోకేష్ కు వినతిపత్రాలను సమర్పించారు. వీరందరి నుంచి వినతి పత్రాలను అందుకున్న లోకేష్ వారి సమస్యలను అధికారులతో మాట్లాడి వీలయినంత త్వరలో పరిష‌్కరిస్తానని హామీ ఇచ్చారు.


Tags:    

Similar News