Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. బయట వరకూ క్యూ లైన్
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు.;
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. సత్వరం దర్శనం వారికి లభించేలా చర్యలు తీసుకుంటున్నారు. సర్వీస్ లైన్ ను ఏర్పాటు చేసి భక్తులను అందులో పంపించే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. సామాన్యభక్తులకు దర్శనం సులువుగా లభించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. వీలయినంత త్వరగా భక్తులు బయట క్యూ లైన్ లలో వేచి ఉండకుండా చూడటమే తమ ప్రధమ కర్తవ్యంగా భావించి వివిధ నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. అందులో భాగంగానే త్వరగా దర్వనం లభించేందుకు సర్వీస్ లైన్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనివల్ల గతంలో కంటే ఎక్కువ సమయ క్యూ లైన్ లలో వేచి ఉండకుండా శ్రీవారిని దర్శించుకునే వీలుంది.