మూసీ ప్రక్షాళనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే?
మూసీ ప్రక్షాళన చేయాల్సిందేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు
మూసీ ప్రక్షాళన చేయాల్సిందేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. మూసీని ప్రక్షాళనచేయాల్సిందేనని, నీళ్లు ఇవ్వాల్సిందేనన్న కిషనర్ కృష్ణా, గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. అయితే మూసీ పునరుజ్జీవం పేరిట ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
ఇళ్లు కూలగొడితే...?
ఇళ్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఊరుకోబోమని కిషన్ రెడ్డి అన్నారు. రిటైనింగ్ వాల్ కట్టాలని, సిటీలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కులగణనకు తాము వ్యతిరేకం కాదని, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తననని, డీఎన్‌ఏ ఏంటో ప్రజలకు తెలుసు, ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.