Andhra Pradesh : ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు;

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత కాగా, ద్వితీయ సంవత్సరంలో 83 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ఉన్నత మండలి విద్యాశాఖ అధికారుల తెలిపారు.
ఫలితాలను...
ఫలితాలను resultsbie.ap.gov.in వెబ్ సైట్ తో పాటు మన మిత్రా వాట్సాప్ నెుంబరు9552300009కు హాయ్ అని మెసేజ్ పెట్టినా వెంటనే ఫలితాలు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 10,17,102 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫెయిల్ అయిన వారు నిరాశకు గురికావద్దని నారాలోకేశ్ కోరారు.