Nara Bhuvaneshwari:నేడు చిత్తూరు జిల్లాలో భువనేశ్వరి

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నారా భువనేశ్వరి నేడు పర్యటించనున్నారు.;

Update: 2024-02-21 02:51 GMT
nara bhuvaneswari, tirupathi, comments, andhra pradesh
  • whatsapp icon

Nara Bhuvaneshwari:ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నారా భువనేశ్వరి నేడు పర్యటించనున్నారు. నిజం గెలవాలి యాత్ర పేరుతో భువనేశ్వరి రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలుకు వెళ్లినప్పుడు తట్టుకోలేక మరణించిన కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. ఒక్కొక్క కుటుంబానికి మూడు లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు.

కుప్పం నియోజకవర్గంలో...
నారా భువనేశ్వరి ఈ నెల 23 వరకు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. నేడు కుప్పం నియోజకవర్గంలో మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కుప్పం నియోజకవర్గంలోనూ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు. భువనేశ్వరి పర్యటనకు సంబంధించి నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తారు.


Tags:    

Similar News