జగన్ పై నీతి ఆయోగ్ సభ్యుడు ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ బృందం భేటీ అయింది.

Update: 2022-07-22 13:20 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ బృందం భేటీ అయింది. తలసరి ఆదాయం, వ్యవసాయ రంగంతో పాటు దాని అనుబంధ రంగాలు దేశ సగటు కన్నా ఏపీ లో వృద్ధి రేటు బాగా ఉందని ప్రశంసిచారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను కూడా వివరించారు. అనేక రాష్ట్రాలతో పోలిస్తే దేశంలో ఏపీ చాలా మెరుగ్గా ఉందని రమేష్ చంద్ ఈ సందర్భంగా కితాబిచ్చారు. ప్రతి రంగంలో లక్ష్యాలను నిర్దేశించుకుని, అందుకు అనుగుణంగా సాగుతున్న తీరు ప్రశంసనీయమని రమేష్ చంద్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఏపీ నెంబరు వన్ గా...
ఆయిల్ పామ్ సాగు ద్వారా వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించారన్నారు. ఆర్టీకేలద్వారా రైతులకు సమగ్ర వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని రమేష్ చంద్ అన్నారు. ఆర్బీకేలు క్షేత్రస్థాయిలో అత్యుత్తమ వ్యవస్థ అని కొనియాడారు. పండ్లు, మత్స్య ఉత్పత్తుల్లోనూ ఏపీ నెంబర్ వన్ గా ఉందని రమేష్ చంద్ అన్నారు. దీంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ రమేష్ చంద్ కు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కొత్త కార్యక్రమాలను కూడా ఆయనకు జగన్ వివరించారు.


Tags:    

Similar News