తిరుమలలో రష్ ఎక్కువగానే
రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు;

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీరు శ్రీవారిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
హుండీ ఆదాయం..
నిన్న తిరుమల శ్రీవారిని 74,817 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,350 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.97 కోట్ల రూపాయలు ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సమయం దగ్గర పడుతుండటంతో తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరగనుంది. ఇందుకు తగిన ఏర్పాట్లను టీటీడీ చేస్తుంది.