మార్చి 1 నుంచి ఫ్యామిలీ డాక్టర్

ఆంధ్రప్రదేశ్ లో ఇంటి వద్దకే వైద్య సేవలను అందించే కార్యక్రమాన్ని వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు

Update: 2023-02-20 03:34 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఇంటి వద్దకే వైద్య సేవలను అందించే కార్యక్రమాన్ని వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ట్రయల్ రన్ లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో 257 హెల్త్ క్లినిక్ ల ద్వారా ఫ్యామిలీ డాక్టర్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం సక్రమంగా జరిగితే, అందులో లోటుపాట్లను గుర్తించి ఇంటి వద్దకే వైద్యసేవలను మార్చి ఒకటో తేదీ నుంచి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ట్రయల్ రన్ లో భాగంగా...
ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి ఇంటికి చెందిన ఆరోగ్య పరిస్థితి గురించి అధ్యయనం చేసి వారికి సకాలంలో వైద్య సేవలు అందించడానికి ఈ పథకాన్ని అమలులోకి తీసుకురావాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత ఎన్టీఆర్ జిల్లాలో ట్రయల్ రన్ లో భాగంగా ప్రవేశపెట్టారు.


Tags:    

Similar News