కేతిరెడ్డి షాకిచ్చిన రెవెన్యూ అధికారులు
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు.;

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. గుర్రాల కొండపై నిర్మించిన గెస్ట్ హౌస్ స్థలం ప్రభుత్వ భూమిగా గుర్తించారు. రెండున్నర ఎకరాల అసైన్డ్ భూమిని కుటుంబ సభ్యుల పేరుతో కేతిరెడ్డి రిజిస్టర్ చేయించుకున్నట్లు గుర్తించిన రెవెన్యతూ అధికారులు భూమిని స్వాధీనం చేసుకునేందుకు అక్కడకు వెళ్లారు.
గుర్రాల కొండపై...
అయితే కొండపైకి వెళ్లే మార్గంలో గేటు వేసి ఉండటంతో వీఆర్ఓలు వెనుతిరిగారు. గెస్ట్ హౌస్ స్థల వివాదంపై హైకోర్టులో కేతిరెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే నేడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పిటీషన్ పై హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత రెవెన్యూ అధికారులు ఈ స్థలంలో ఉన్న ఆక్రమణలను తొలగించాలని నిర్ణయించినట్లు తెలిసింది.