Tirumala : ఆదివారం.. రష్ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. చంద్రగ్రహణం అనంతరం స్వామి వారిని దర్శించుకుంటున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న చంద్రగ్రహణం కారణంగా కొంత రద్దీ తక్కువగా కనిపించినప్పటికీ నేడు మాత్రం భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. చంద్రగ్రహణం స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే పుణ్యమని భావించిన భక్తులు ఎక్కువ మంది తిరుమలకు వస్తున్నారు. తిరుమల పట్టణంలోని ప్రజలతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో ప్రజలు స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు.
చంద్రగ్రహణం తర్వాత...
నిన్న తిరుమల శ్రీవారిని 47,351 మంది భక్తులు మాత్రమే దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వీరిలో 23,836 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.03 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పన్నెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేని భక్తులకు పన్నెండు గంటల దర్శన సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.