తిరుమలలో మళ్లీ క్యూ లైన్ పెరిగింది.. దర్శన సమయం?

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి

Update: 2022-09-16 03:12 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట వరకూ క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. రూ300 లు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.

హుండీ ఆదాయం....
ఇక నిన్న తిరుమల శ్రీవారిని 65,654 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,419 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి ఆదాయం నాలుగు కోట్ల రూపాయలు అని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈ నెల 20న తిరుమలలో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.


Tags:    

Similar News