తిరుమలలో ఐదు కిలోమీటర్ల మేర భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వీకెండ్ కావడంతో ఆదివారం నాడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

Update: 2022-09-11 03:40 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వీకెండ్ కావడంతో ఆదివారం నాడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వరసగా రెండు రోజులు సెలవులు రావడం కూడా భక్తుల రద్దీ పెరగడానికి కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం ఈరోజు ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపయి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నందకం గెస్ట్ హౌస్ వరకూ క్యూ లైన్ ఉంది. వీరికి దర్శనం అయ్యేందుకు 25 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.

ప్రత్యేక దర్శనానికి....
రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు పొందిన వారికి మూడు నుంచి నాలుగు గంటల దర్శన సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 80,741 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,494 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.22 కోట్ల రూపాయలుగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News