క్యూ లైన్లు భారీగా.. దర్శన సమయం
తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. ఆస్థాన మండపం వరకూ క్యూ లైన్ కొనసాగుతుంది
తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. ఆస్థాన మండపం వరకూ క్యూ లైన్ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 71,589 మంది భక్తులు సందర్శించారు. 41,240 మంది శ్రీవారికి తలనీలాలను సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.30 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కంపార్ట్‌మెంట్స్ అన్నీ నిండిపోయాయి. ఆస్థానమండపం వరకూ క్యూ లైన్ కొనసాగుతుంది. దర్శనానికి పదిహేను గంటల సమయం పడుతుంది.
వీకెండ్ కావడంతో...
ఇక శని, ఆది వారాలు కావడంతో ఈరోజు రేపు కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగనుంది. అయితే తిరుమలలో భక్తుల రద్దీ పై ఈవో ధర్మారెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. ప్రతి గురువారం నుంచి ఆదివారం వరకూ తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అదనంగా సిబ్బందిని, అధికారులను నియమించి భక్తులు ఇబ్బంది పడకుండా చూడాలని ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదం, మంచినీరు వంటివి నిరంతరాయంగా సరఫరా చేయాలని ఆయన ఆదేశించారు.