దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. వీకెండ్ కావడం వల్ల భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. వీకెండ్ కావడం, పరీక్ష ఫలితాలు విడుదల అవ్వడం కారణాల వల్ల భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. ఏమాత్రం తగ్గడం లేదు. స్వామి వారి దర్శనానికి గంటల సమయం పడుతుంది. తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు.
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ...
నిన్న తిరుమల శ్రీవారిని 88,613 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,153 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలను సమర్పించుకున్నారు. స్వామి వారి హుండీ కానుకలు 4.24 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం 19 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారికి దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది.